నగరమే ప్రేమ నేపథ్యం | Rahul Ravindran's 'Hyderabad Love Story' audio on 10th | Sakshi
Sakshi News home page

నగరమే ప్రేమ నేపథ్యం

Jan 6 2015 11:50 PM | Updated on Sep 2 2017 7:19 PM

నగరమే ప్రేమ నేపథ్యం

నగరమే ప్రేమ నేపథ్యం

ప్రతి మనిషికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఈ ప్రేమకు డబ్బు, చదువు, ఉద్యోగం - ఇలా ఏదైనా నేపథ్యం కావచ్చు.

 ప్రతి మనిషికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఈ ప్రేమకు డబ్బు, చదువు, ఉద్యోగం - ఇలా ఏదైనా నేపథ్యం కావచ్చు. కానీ తమ సినిమాలో ప్రేమకు హైదరాబాద్ నగరమే నేపథ్యంగా నిలిచిందని దర్శకుడు రాజ్‌సత్య చెబుతున్నారు. రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా కాంబినేషన్‌లో పద్మజ. ఎస్ సమర్పణలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. రొమాన్స్, ఫ్యాంటసీ, ఎమోషన్స్‌తో ఆద్యంతం ఈ చిత్రం ఆసక్తికరంగా రూపొందుతోందని, ఈ నెల 10న పాటలను, ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నింటి, సహనిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి.
 

Advertisement
 
Advertisement
Advertisement