దర్శకేంద్రుడి పర్యవేక్షణలో ‘ఎన్టీఆర్‌’!

Raghavendra Rao Supervises The NTR BIopic Movie - Sakshi

బాలకృష్ణ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ తరువాత చాలా మంది పేర్లే  వినిపించినా... ఎవరూ ఆ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. సో..బాలయ్యే దాని పగ్గాలు చేపట్టి డైరెక్షన్‌ కూడా చేసేయాలని ఫిక్స్‌ అయ్యారు. అయితే డైరెక్షన్‌ చేయడం అంటే మాములు విషయం కాదు. అసలే ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది. 

అందుకే దర్శకేంద్రుడి సహాయాన్ని బాలయ్య తీసుకుంటున్నారని సమాచారం. దర్శకత్వ పర్యవేక్షణ అంటే గుర్తుకొచ్చేది రాఘవేంద్రరావే. ఆయన చాలా సినిమాలకు పర్యవేక్షణ చేశారు. సినిమాకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ...  వెనకుండి నడిపిస్తారు. బాలయ్య కూడా దర్శకేంద్రుడి పర్యవేక్షణలో ‘ఎన్టీఆర్‌’ సినిమాను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top