సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు | Raghava Lawrence to star in Rangasthalam Tamil remake | Sakshi
Sakshi News home page

సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు

Nov 4 2019 3:50 AM | Updated on Nov 4 2019 3:50 AM

Raghava Lawrence to star in Rangasthalam Tamil remake - Sakshi

లారెన్స్‌

సౌండ్‌ ఇంజనీర్‌ చిట్టిబాబు  గత ఏడాది బాక్సాఫీస్‌ దగ్గర రీసౌండ్‌ వచ్చేలా ‘రంగస్థలం’ సినిమాతో మోత మోగించారు. ఇప్పుడు ఆ సినిమా తమిళంలో రీమేక్‌ కాబోతోందని సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సౌండ్‌ ఇంజనీర్‌ (వినికిడి లోపం ఉన్న వ్యక్తిని సరదాగా ఇలా అంటారు) చిట్టిబాబు పాత్రలో చరణ్‌ కనిపించారు. ఇప్పుడు సౌండ్‌ ఇంజనీర్‌గా మారబోతున్నారు లారెన్స్‌. ‘రంగస్థలం’ తమిళ రీమేక్‌లో రామ్‌చరణ్‌ పాత్రను రాఘవ లారెన్స్‌ చేయనున్నారట. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement