హిట్ సిరీస్లో మరో సీక్వల్..! | Raghava Lawrence plans Kanchana sequel | Sakshi
Sakshi News home page

హిట్ సిరీస్లో మరో సీక్వల్..!

Aug 23 2017 1:41 PM | Updated on Sep 17 2017 5:53 PM

హిట్ సిరీస్లో మరో సీక్వల్..!

హిట్ సిరీస్లో మరో సీక్వల్..!

హార్రర్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న కోలీవుడ్ హీరో లారెన్స్, అదే జానర్ లో మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు.

హార్రర్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న కోలీవుడ్ హీరో లారెన్స్, అదే జానర్ లో మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. తనకు హీరోగా స్టార్ ఇమేజ్ సాధించిన పెట్టిన కాంచన సీరీస్ లో మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథాకథనాలు కూడా రెడీ అయిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ముని, కాంచన, గంగ సినిమాలతో ఆకట్టుకున్న లారెన్స్ నాలుగో సినిమాతో మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుండగానే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడవ్వటం విశేషం. తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయినట్టుగా సమాచారం. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా కోసం కోరియోగ్రాఫర్ గా మారిన లారెన్స్ తన నెక్ట్స్ సినిమాను సొంతం నిర్మాణ సంస్థలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement