విశాల్‌తో జోడీ కుదిరింది! | Raashi Khanna  Act With Vishal in Tamil Temper Remake | Sakshi
Sakshi News home page

విశాల్‌తో జోడీ కుదిరింది!

Mar 23 2018 10:39 AM | Updated on Aug 9 2018 7:30 PM

Raashi Khanna  Act With Vishal in Tamil Temper Remake - Sakshi

రాశీఖన్నా

సాక్షి, సినిమా : నటుడు విశాల్‌తో రాశీఖన్నాకు జోడీ కుదిరిందట. విశాల్‌ ఇప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తూ నిర్మిస్తున్నారు. అందులో ఒకటి ఇరుంబుతిరై. ఇందులో సమంత నాయకి. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్న సండైకోళీ–2 చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో కీర్తీసురేశ్‌ నాయకి.  తాజాగా మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. తెలుగులో పూరిజగన్నా«థ్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్‌టీఆర్, కాజల్‌అగర్వాల్‌ జంటగా నటించిన విజయవంతమైన టెంపర్‌ రీమేక్‌లో నటించనున్నారు. అ చిత్రంలో విశాల్‌ మరోసారి పోలీస్‌ అధికారిగా నటించనున్నారు.

లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా వెంకట్‌ మోహన్‌ అనే నవదర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన మహేష్‌బాబు నటించిన స్పైడర్‌ చిత్రానికి సహయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో హైదరాబాద్‌ బ్యూటీ రాశీఖన్నా విశాల్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అమ్మడు కోలీవుడ్‌లో బిజీ అవుతోంది. ఇప్పటికే అధర్వకు జంటగా ఇమైకానోడిగల్‌ చిత్రంలో నటించింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. దీని గురించి రాశీఖన్నా చెబుతూ విశాల్‌కు జంటగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం సిద్ధార్థ్‌కు జంటగా నటిస్తున్న చిత్ర షూటింగ్‌Š  చిత్రీకరణ జరుగుతోందన్నారు. ఇది తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కుతోందని, అదే విధంగా జయంరవి సరసన ఒక చిత్రం చేయనున్నానని, అది వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమై మే లో విడుదల కానుందని చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement