‘వైఎస్‌ జగన్‌ అలా చెప్పడం గొప్ప విషయం’

R Narayana Murthy Applauds CM YS Jagan Over Defection Policy - Sakshi

సినీ దర్శక, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి

సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’  విజయ యాత్రను మంగళవారం సప్తగిరి థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ..భారత్‌లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని అన్నారు. నేడు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరును విమర్శించారు. నేతలు ఓట్లను ఏవిధంగా కొంటున్నారు.. ఎన్నికలు అయ్యాక ఫిరాయింపులకు పాల్పడుతున్న తీరును ఈ సినిమాలో చూపించానన్నారు. అయితే ఫిరాయింపుదారులను కచ్చితంగా రాజీనామా చేసి రావాలని వైఎస్‌ జగన్‌ చెప్పడం చాలా గొప్ప విషయమని, ఆయనను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top