స్టోరీ.. పూరీ; డైరెక్టర్.. మీరే!! | puri jagannath challenges upcoming directors with his stories | Sakshi
Sakshi News home page

స్టోరీ.. పూరీ; డైరెక్టర్.. మీరే!!

Dec 30 2014 9:03 AM | Updated on Mar 22 2019 1:53 PM

స్టోరీ.. పూరీ; డైరెక్టర్.. మీరే!! - Sakshi

స్టోరీ.. పూరీ; డైరెక్టర్.. మీరే!!

పది రోజులు.. పది స్టోరీలు.. పది నిమిషాలు.. అంటూ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యంగ్ టాలెంటును ఊరిస్తున్నారు.

ఎక్కడున్నారు మీరంతా?
15 ఏళ్లుగా సిన్మా ఇండస్ట్రీలో ఉన్నా. వరుసగా సినిమాలు తీస్తున్నా. నాకన్నా తెలివైన వాళ్లు... నా నెక్స్ట్ జనరేషన్ వాళ్లు... చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడెక్కడో ఉన్నారు.  ఇండస్ట్రీకి కొత్త బ్లడ్ కావాలి. కొత్త ట్రెండ్ రావాలి. ఇండస్ట్రీ వెయిటింగ్. ఎక్కడున్నారు మీరంతా?!

పది రోజులు.. పది స్టోరీలు.. పది నిమిషాలు.. అంటూ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యంగ్ టాలెంటును ఊరిస్తున్నారు. తాను పది రోజుల పాటు రోజుకో కథ చొప్పున ఇస్తానని, దాన్ని పది నిమిషాల షార్ట్ ఫిలింగా తీసి చూపించాలని అడుగుతున్నారు. లేకపోతే.. తాము తీసిన సినిమాలే చూడాల్సి వస్తుందన్నారు. 'సాక్షి'తో కలిసి తానీ టాలెంట్ సెర్చ్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్కు ఏమాత్రం కొరత లేదని, అందుకే ఎలాంటి డిజిటల్ కెమెరాతోనైనా షార్ట్ ఫిలిం తీయొచ్చని అన్నారు. ఏ కెమెరా చేతిలో లేకపోతే చివరకు ఐఫోన్తో అయినా సరే.. సినిమా తీసేయొచ్చని ఆఫర్ ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం.. స్టోరీ వినండి, కెమెరా పట్టుకోండి, షార్ట్ ఫిలిం తీసేయండి. రేపటి తరానికి మీరే కాబోయే టాప్ డైరెక్టర్!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement