నా ఇస్మార్ట్‌ ఫైటర్‌కి జన్మదిన శుభాకాంక్షలు

Puri Jagannadh Emotional Tweet On Charmy Kaur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో చార్మికి ప్రత్యేక స్థానం ఉంది. 13 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ఎంటరై కొన్నేళ్ల పాటు తన అందచందాలతో టాలీవుడ్‌ను ఊపేసింది. ఆ తర్వాత నిర్మాతగా మారి డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్‌ అనే సంస్థను స్థాపించి జ్యోతి లక్ష్మీ, పైసా వసూల్‌, ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించింది. ఈ రోజు చార్మి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. (చదవండి : సూపర్‌స్టార్‌ లుక్‌పై బండ్ల గణేష్‌ కామెంట్స్‌)

‘నా ఇస్మార్ట్ ఫైటర్ చార్మికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నీ జీవితం అంత సులువుగా సాగ‌లేదు. అయితే నువ్వెంత బ‌ల‌వంతురాలివో నాకు తెలుసు. మ‌నం క‌లిసి ఇంకా ప్ర‌యాణించాలి. నువ్వు న‌న్ను గ‌ర్వ‌ప‌డేలా చేశావు. పూరీ క‌నెక్ట్స్‌కు నువ్వే అస‌లైన బ‌లం. నీకు మరిన్ని విజ‌యాలతో పాటు ఆరోగ్యంగా నువ్వు ఉండాల‌ని కోరుకుంటున్నాను’అంటూ పూరీ ట్వీట్‌ చేశాడు.  ప్రస్తుతం చార్మి పూరి దర్శకత్వం వహిస్తున్న విజయ్‌ దేవరకొండ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top