ప్రియాంక చోప్రా వైట్‌ డ్రస్‌ ధర అక్షరాల... | Priyanka Chopra White Dress Price About 1 Lakh | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రా వైట్‌ డ్రస్‌ ధర అక్షరాల...

Jul 20 2018 2:02 PM | Updated on Jul 20 2018 2:07 PM

Priyanka Chopra White Dress Price About 1 Lakh - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, పాప్‌ సింగర్‌, హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనాస్‌లు తమ ప్రేమ వ్యవహారంతో అందరి దృష్టిని ఆకర్షించారన్నది అక్షరసత్యం. గతకొద్ది కాలంగా పెళ్లిళ్లలో, పుట్టినరోజు వేడుకల్లో, రెస్టారెంట్లలో ఇలా తరచూ జంటగా దర్శనమిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో వీరిద్దరికీ పెళ్లి జరగబోతోందని, ఇరుకుటుంబాలకు వీరి పెళ్లి సమ్మతమేననే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా దీనిపై ప్రియాంక కానీ జోనాస్‌ కానీ స్పందించకపోవటం గమనార్హం. అసలు విషయానికొస్తే ప్రియాంక ఇప్పుడు ఖరీదైన ఫ్యాషన్‌కు ఐకాన్‌గా మారింది.

మొన్నామధ్య ఈ అమ్మడు రూ. 4లక్షలు విలువ చేసే బ్యాగ్‌ ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. జూలై 18న ప్రియాంక తన పుట్టిన సందర్భంగా ఓ వైట్‌ స్కర్ట్‌లో ప్రియుడు నిక్‌తో దర్శనమిచ్చిన సంగతి విధితమే. కాగా ఇప్పుడు ఆ వైట్‌ డ్రస్‌ ధర దాదాపు 2లక్షలని తెలిసి నెటిజన్లు నోర్లు వెల్లబెడుతున్నారు. ‘‘ బాల్‌మెయిన్‌ బటన్డ్‌ మాక్సీ స్కర్ట్‌’’, ‘‘వైనస్‌ వైట్‌ ములస్‌’’ ఈ రెండింటి ధర 1850, 895 డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే 1,86,660రూపాయలు.  గ్లోబల్‌ స్టార్‌ కదా.. ఏది చేసినా ఖరీదుగానే ఉంటుంది.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement