ప్రియాంక-నిక్‌ పెళ్లెక్కడో తెలుసా? | Priyanka Chopra - Nick Jonas Wedding At Jodhpur | Sakshi
Sakshi News home page

ప్రియాంక-నిక్‌ పెళ్లెక్కడో తెలుసా?

Oct 12 2018 6:52 PM | Updated on Oct 12 2018 6:52 PM

Priyanka Chopra - Nick Jonas Wedding At Jodhpur - Sakshi

బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ల పెళ్లి ప్రస్తుతం హాటాఫిక్‌గా ఉంది. విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ, సోనమ్‌ కపూర్‌-ఆనంద్‌ అహుజాల మాదిరి వీరు కూడా డెస్టినేషన్‌ మ్యారేజ్‌కు ఏమైనా ప్లాన్‌ చేశారా? అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా అందిన అప్‌డేట్‌ ప్రకారం, వీరిద్దరూ.. నిశ్చితార్థం మాదిరి పెళ్లి కూడా భారత్‌లోనే చేసుకోవాలని నిర్ణయించారట. భారతీయ సంప్రదాయ ప్రకారం జోధ్‌పూర్‌లో ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌లు ఒకటి కాబోతున్నారని తెలిసింది. వచ్చే నెలలో వీరి పెళ్లి జోధ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరగనుందట. 

దానికి ముందు అక్టోబర్‌లో న్యూయార్క్‌ సిటీలో ప్రియాంకను పెళ్లి కూతుర్ని చేయనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత 200 మంది అతిథులతో జోధ్‌పూర్‌లోని ఉమేధ్‌ భవన్‌ వీరి వివాహ వేడుకకు వేదిక కానుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భారత్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా-నిక్‌ జోనస్‌లు జోధ్‌పూర్‌ కూడా వెళ్లి వచ్చారని తెలిసింది. వీరి జీవితంలో ఎంతో శుభకరమైన ఘట్టానికి డ్రీమ్‌ వెడ్డింగ్‌ వెన్యూగా దీన్నే నిర్ణయించారట. కేవలం క్లోజ్‌ ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించాలని ప్రియాంక, నిక్‌లు భావిస్తున్నారు. ప్రియాంకకు చాలామంది హాలీవుడ్‌ స్నేహితులు ఉండటంతో పాటు, నిక్‌ జోనస్‌ కూడా అక్కడ అబ్బాయే కావడంతో, న్యూయార్క్‌ సీటెల్‌లో పెళ్లి కూతుర్ని చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని సన్నిహిత వర్గాలు చెప్పాయి.   

Advertisement
 
Advertisement
Advertisement