షాట్‌ గ్యాప్‌లో స్మాల్‌ టచ్‌! | Priyanka Chopra Just Got This Season's Trendiest Haircut | Sakshi
Sakshi News home page

షాట్‌ గ్యాప్‌లో స్మాల్‌ టచ్‌!

Nov 23 2017 1:17 AM | Updated on Nov 23 2017 1:17 AM

Priyanka Chopra Just Got This Season's Trendiest Haircut - Sakshi

ఫేస్‌కి సూట్‌ అయ్యే హెయిర్‌ స్టైల్‌ చేసుకోవడం ఓ ఆర్ట్‌. హీరోయిన్లకైతే ఈ విషయంలో చాలా ఇబ్బందే. ఎందుకంటే, సీన్‌కో హెయిర్‌ స్టైల్‌లో కనిపిస్తారు. ఒకవేళ ఆ స్టైల్‌ సూట్‌ కాకపోతే ఉన్న అందం కాస్తా పోతుంది. లక్కీగా కొంతమంది హీరోయిన్లకు అన్ని రకాల స్టైల్స్‌ నప్పుతాయి. ఆ లిస్ట్‌లో హాట్‌ గాళ్‌ ప్రియాంకా చోప్రా ఒకరు. ఈవిడగారికి బిగుతుగా జడ వేసినా బాగుంటుంది. లూస్‌ హెయిర్, బాబ్‌ కట్‌.. ఇలా ఏదైనా సూపర్‌. ఇప్పుడు ప్రియాంక కొత్త స్టైల్‌ ఏంటంటే.. ‘షార్ట్‌ హెయిర్‌’.

అమెరికన్‌ టీవీ సిరీస్‌ క్వాంటికో థర్డ్‌ పార్ట్‌లో అలెక్స్‌ పారిస్‌ అనే పాత్రలో చేస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె జుత్తును కత్తిరించుకున్నారు. షూటింగ్‌ స్పాట్‌లో కాస్త గ్యాప్‌ దొరికితే చాలు హెయిర్‌ సరిచేసుకుంటూ.. బాగున్నానా? అన్నట్లు ఫేస్‌ను మిర్రర్‌లో చూసుకుంటున్నారట. పక్కన ఉన్న ఫొటోలో చుశారుగా! ప్రియాంక తన జుత్తును ఎలా సరిచేసుకుంటున్నారో? ‘‘కొత్త హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాను. సరిగా ఉందో లేదోనని హెయిర్‌ని టచ్‌ చేయకుండా ఉండలేకపోతున్నాను’’ అంటున్నారు ప్రియాంక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement