దాచాల్సిన అవసరం లేదు! | Sakshi
Sakshi News home page

దాచాల్సిన అవసరం లేదు!

Published Wed, Sep 19 2018 12:52 AM

Priyanka Chopra faced Asthma Before movies - Sakshi

గొప్పలు చెప్పుకోవడానికి కాదు మనలో ఉన్న లోపాలను ఒప్పుకోవడానికి నిజంగా ధైర్యం కావాలి. ఈ విషయంలో ప్రియాంకా చోప్రా ముందు వరసలోనే ఉన్నారు. ‘‘నేను ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నా’’ అని సూటిగా చెప్పేశారు. ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఓ సంస్థ కోరిన మీదట వారిలో ధైర్యం  నింపే విధంగా మాట్లాడారు ప్రియాంక. ‘‘నాకు బాగా దగ్గరగా ఉన్నవారికి నేనూ ఆస్తమా పేషంట్‌ అని తెలుసు. ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆస్తమా నన్ను కంట్రోల్‌ చేయడానికి ముందే నేనూ ఆస్తమాను కంట్రోల్‌ చేయగలనని నమ్మాను. ఆస్తమా ఉందని అధైర్యపడలేదు. నా గోల్‌ను సాధించుకోవడంలో బెదరలేదు’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా.

ఇక ప్రియాంకా చోప్రా సినిమాల దగ్గరకు వస్తే సోనాలీ బోస్‌ దర్శకత్వంలో ‘ద స్కై ఈజ్‌ పింక్‌’ అనే సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పర్సనల్‌ లైఫ్‌లోకి తొంగి చూస్తే.. కాబోయే భర్త నిక్‌ జోనస్‌కు ముద్దు రూపంలో మంచి గిఫ్ట్‌ ఇచ్చారు ప్రియాంకా చోప్రా. ఇటీవల నిక్‌ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌గా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో నిక్‌ని ముద్దాడారు. ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక్కడ ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో అదే. 

Advertisement
 
Advertisement
 
Advertisement