రూల్స్‌ అన్నీ బ్రేక్‌ చేసేశాం!

Priyanka Chopra Bridal Shower In America - Sakshi

‘ఓవైపు ప్రేమ, ఆనందం.. మరోవైపు గది నిండా అద్భుతమైన వ్యక్తిత్వం గల మహిళలు.. వారితో పాటు ఇంకొంత మంది స్పెషల్‌ జెంటిల్‌మన్‌. పెళ్లికూతురి వేడుక రూల్స్‌ అన్నీ బ్రేక్‌ చేసేశాం. వాట్‌ ఏ సర్‌ప్రైజ్‌. ఇలాంటి వేడుక నిర్వహించి నన్ను ఆశ్చర్యం, ఆనందంలో ముంచెత్తిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు. ఈరోజు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నా. దీనికంతటికి కారణమైన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. పర్ఫెక్ట్‌. ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను’ అంటూ కాబోయే పెళ్లికూతురు ప్రియాంక చోప్రా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

అమెరికాలో జరిగిన తన బ్రైడల్‌ షవర్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి అభిమానులకు ఆనందాన్ని పంచారు. ఈ వేడుకకు ప్రియాంక, ఆమెకు కాబోయే భర్త నిక్‌ జోనస్‌ల కుటుంబ సభ్యులతో పాటు ఆస్కార్‌ అవార్డు గ్రహీత లుపిత యోంగో కూడా హాజరయ్యారు. వీరితో పాటు ప్రియాంక ఫ్రెండ్స్‌ కూడా ఈ పార్టీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా ప్రేమపక్షులు ప్రియాంక చోప్రా-నిక్‌ జోనస్‌.. ఇరు కుటుంబాల సమక్షంలో జూలైలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి తేదీ కూడా ఖరారు కానుంది. వీరి వివాహం ఉదయ్‌పూర్‌లో జరుగనుందని బీ-టౌన్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top