బెడిసి కొట్టిన ప్రమోషన్‌.. సారీ చెప్పిన హీరో

Priyadarshi Promotional Video Controversy - Sakshi

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నిను వీడని నీడను నేనే. హారర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సందీప్‌ నిర్మాతగానూ మారుతుండటంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్‌లో భాగంగా రిలీజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు విమర్శలకు కారణమైంది.

కమెడియన్‌ ప్రియదర్శి తన బైక్‌ను ఎవరో కొట్టేశారంటూ నిన్న తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్‌ కావటంతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా స్పందించింది. దీంతో ప్రియదర్శి ఆ వీడియోను తన ట్విటర్‌ అకౌంట్ నుంచి డిలీట్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన హీరో సందీప్‌ కిషన్‌ క్లారిటీ ఇచ్చాడు.

ప్రేక్షకులను క్షమాపణ కోరిన సందీప్‌ అది సినిమా ప్రమోషన్‌ కోసం చేసిన ప్రాంక్‌ వీడియో అని చెప్పాడు. సినిమా నటించేందుకు ప్రియదర్శి డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో అతని బైక్‌ స్పెషల్‌ అపియరెన్స్‌ ఇచ్చిందన్నాడు సందీప్‌. ఇటీవల మలయాళ నటి ఆశా శరత్‌ ఇలా ప్రమోషన్‌ వీడియోతో చిక్కుల్లో పడ్డారు. తన భర్త కనిపించటం లేదంటూ ఆశా పోస్ట్ చేసిన వీడియో వైరల్‌ కావటంతో చిత్రయూనిట్ అది ప్రమోషనల్‌ వీడియోఅధికారిక ప్రకటన విడువల చేయాల్సి వచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top