ప్రియా.. ప్రియా... వెళ్లొద్దే! | Priya Prakash Varrier Deactivated Her Instagram Account | Sakshi
Sakshi News home page

ప్రియా.. ప్రియా... వెళ్లొద్దే!

May 20 2020 12:09 AM | Updated on May 20 2020 12:09 AM

Priya Prakash Varrier Deactivated Her Instagram Account - Sakshi

రెండేళ్ల క్రితం ‘ఒరు అడార్‌ లవ్‌’ సినిమా టీజర్‌లో కన్ను కొడుతూ కనిపించి, ‘కన్నుకుట్టి’గా సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించారు ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసిన ఒక్కరోజులోనే ఆరులక్షల ఫాలోయర్స్‌ను సంపాదించిన ఇండియన్‌ సెలబ్రిటీగా సోషల్‌ మీడియా రికార్డును దక్కించుకున్న ఘనత ప్రియాది. తాజాగా ప్రియ తన ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేయడం చర్చనీయాంశమైంది. ‘‘మా అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేసింది. ఇది తాత్కాలికం మాత్రమే. తను కొంత గ్యాప్‌ తీసుకోవాలనుకుంటోంది. కొంత సమయం తర్వాత ఆమె తిరిగి ఈ ప్లాట్‌ఫామ్‌లో జాయిన్‌ కావొచ్చు’’ అని ప్రియ తండ్రి ప్రకాష్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రియ తన అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించిందని, అందుకే ప్రియ ఇలా చేశారని టాక్‌. సోషల్‌ మీడియా స్టార్‌ కన్నా కూడా నటిగా పాపులర్‌ అవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు ఇటీవలే టిక్‌టాక్‌లో జాయిన్‌ అయ్యారు ప్రియాప్రకాష్‌. ప్రస్తుతం ఆమె ఫేస్‌బుక్, టిక్‌టాక్‌ అకౌంట్స్‌ యాక్టివ్‌గానే ఉన్నాయి. ఇన్‌స్టా నుంచి ఈ కన్నుకుట్టి వెళ్లగానే ‘ప్రియా.. ప్రియా.. వెళ్లొద్దే’ అంటూ అభిమానులు బాధపడిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement