కూతురి శ్ర‌ద్ధాంజ‌లి.. ఓ తండ్రి ఆవేద‌న‌ | Pratyusha Banerjee's Dad heartbroken As He Couldn't Find A Garland | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: ఓ తండ్రి ఆవేద‌న‌

Apr 2 2020 5:48 PM | Updated on Apr 2 2020 6:20 PM

Pratyusha Banerjee's Dad heartbroken As He Couldn't Find A Garland  - Sakshi

ప్ర‌త్యూష బెన‌ర్జీ (ఫైల్‌)

ముంబై: బాలికా వ‌ధు(చిన్నారి పెళ్లికూతురు) సీరియ‌ల్‌లో ఆనందిగా మెప్పించిన న‌టి ప్ర‌త్యూష బెన‌ర్జీ మ‌ర‌ణించి నాలుగు ఏళ్లు అవుతుంది. 2016 ఏప్రిల్‌1న ముంబైలోని త‌న అపార్ట్‌మెంట్‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆమె శ్ర‌ద్ధాంజ‌లి సంద‌ర్భంగా ఆమె చిత్రాప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించాల‌నుకున్న తండ్రికి లాక్‌డౌన్ కార‌ణంగా నిరాశే ఎదురైంది. 

రోజంతా తిరిగినా త‌న‌కు పూల‌దండ దొర‌క‌లేద‌ని ప్ర‌త్యూష బెన‌ర్జి తండ్రి శంక‌ర్ బెన‌ర్జీ  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం త‌న కూతురి శ్ర‌ద్ధాంజ‌లికి పూల‌మాల వేసి నివాళులు అర్పించేవాడిన‌ని, ఈసారి లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప‌రిస్థితులు మారాయ‌ని ఓ మీడియాతో మాట్లాడుతూ విచారం వ్య‌క్తం చేశారు. చివ‌రికి త‌నే కొన్ని పువ్వుల‌ను తీసుకొని పూల‌దండ సిద్ధం చేసి ప్ర‌త్యూష‌కు నివాళులు అర్పించిన‌ట్లు చెప్పుకొచ్చారు. 

బాలికా వ‌ధు సీరియ‌ల్‌లో ప్ర‌త్యూష‌కు భ‌ర్త‌గా న‌టించిన స‌హ‌నటుడు శ‌శాంక్ వ్యాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా హృద‌య‌పూర్వ‌క సందేశాన్ని పంచుకున్నాడు.  “మ‌నం ఇష్ట‌ప‌డే వాళ్లు భౌతికంగా దూర‌మైనా ఎప్పుడూ మ‌న ప‌క్క‌నే ఉంటారు. క‌నిపించ‌క‌పోయినా మ‌న‌ల్ని గ‌మ‌నిస్తూ ఎప్పుడూ మ‌న‌పై  ప్రేమ‌ను కురిపిస్తారు” అంటూ రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement