నాకే ఎందుకిలా? | pranitha tweets on opportunities | Sakshi
Sakshi News home page

నాకే ఎందుకిలా?

Dec 11 2017 8:10 AM | Updated on Aug 9 2018 7:30 PM

pranitha tweets on opportunities - Sakshi

తమిళసినిమా: నాకే ఎందుకిలా జరుగుతోందని వాపోతోంది నటి ప్రణీత. ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఆ క్రేజ్‌తో వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తోంది. అయితే దక్షిణాదిలో ఏ భాషలోనూ ప్రముఖ కథానాయకిగా పేరు సంపాదించుకోలేకపోతోంది. తెలుగులో మొదట సోలో హీరోయిన్‌గానే పరిచయమైంది. ఆ తరువాత పవన్‌కల్యాణ్‌ వంటి స్టార్‌కు జంటగా నటించినా సెకెండ్‌ హీరోయిన్‌ పాత్రలే వస్తున్నాయని వాపోతోంది. ఇక తమిళంలో అయితే కార్తీకి జంటగా శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో గుర్తింపు పొందలేకపోయింది.

నటుడు సూర్య హీరోగా నటిం చిన మాస్‌ చిత్రంలోనూ రెండవ హీరోయిన్‌ పాత్రకే పరిమితం అయ్యింది. జెమినీగణేశనుమ్‌ సురుళీరాజవుమ్, ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్‌ వం టి కొన్ని చిత్రాల్లో నటించింది. ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్‌ చిత్రంలో నెగిటివ్‌ పాత్రను కూడా ధైర్యం చేసి పోషించింది.అయితే ఆ పాత్రకు ఆమెకు ప్రశంసలు మాట అటుంచితే విమర్శలే ఎక్కువ వచ్చాయన్నది గమనార్హం. అయినా స్టార్‌ ఇమేజ్‌ను పొందలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా లేదు. దీంతో నాకే ఎందుకిలా జరుగుతోంది.నేను అందంగా లేనా, నటనా ప్రతిభను చూపడం లేదా? అంటూ తన ఆవేదనను ట్విట్టర్‌లో వ్యక్తం చేసింది. అయితే నా కూ ఒక టైమ్‌ వస్తుంది అనే ఆశాభావాన్ని వ్య క్తం చేస్తున్న ప్రణీత ప్రస్తుతం కన్నడంలో ఒక చిత్రం, మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement