మహానటి భర్తగా విలక్షణ నటుడు..? | Prakashraju as gemini ganesan in Mahanati | Sakshi
Sakshi News home page

మహానటి భర్తగా విలక్షణ నటుడు..?

Apr 23 2017 11:51 AM | Updated on Sep 5 2017 9:31 AM

మహానటి భర్తగా విలక్షణ నటుడు..?

మహానటి భర్తగా విలక్షణ నటుడు..?

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ చేస్తున్న రెండో సినిమా మహానటి. అలనాటి అందాల

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ చేస్తున్న రెండో సినిమా మహానటి. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇప్పటికే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను ఫైనల్ చేయగా, కథను నడిపించే జర్నలిస్ట్ పాత్రకు సమంతను తీసుకున్నారు.

సావిత్రి సమకాలీన నటి అయిన జమున పాత్రను అనుష్క చేయించాలని భావిస్తున్నారు. అయితే సావిత్రి జీవితంలో కీలకమైన ఆమె భర్త, హీరో జెమినీ గణేషన్ పాత్రను ఎవరితో చేయిస్తారన్న ప్రశ్న చాలా రోజులుగా అభిమానులను వేదిస్తోంది. ఈ పాత్రకు నెగెటివ్ షేడ్స్ కూడా ఉండే అవకాశం ఉండటంతో ఎవరు చేస్తారన్న దానిపై మరింత ఆసక్తి నెలకొంది. ఒక సమయంలో హీరో సూర్య సావిత్రి భర్తగా నటిస్తున్నరన్న టాక్ వినిపించినా.. తరువాత కాదని తేలిపోయింది.

తాజాగా ఈ పాత్రకు విలక్షన నటుణ్ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటుడిగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ మహానటి సినిమాలో సావిత్ర భర్తగా నటించనున్నాడు. ఇప్పటికే దర్శకుడు నాగఅశ్విన్ ప్రకాష్ రాజ్ కు కథ కూడా వినిపించాడు. త్వరలోనే సావిత్రి సినిమాలో పాత్రలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement