ప్రశంసలే ప్రశంసలు! | Praise praise | Sakshi
Sakshi News home page

ప్రశంసలే ప్రశంసలు!

Jun 12 2015 11:43 PM | Updated on Sep 3 2017 3:38 AM

ప్రశంసలే ప్రశంసలు!

ప్రశంసలే ప్రశంసలు!

బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే అంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’.

బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే అంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’.  శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది.
 
 చిత్రవిశేషాలను సుధాకర్ గౌడ్ తెలియజేస్తూ -‘‘జాతీ, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ఈ చిత్రం పలువురి ప్రముఖుల ప్రసంశలు పొందింది. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాలచే పన్ను మినహాయింపు పొందింది.
 
 పలువురు ఐఏయస్ ఆఫీసర్స్ కూడా ఈ చిత్రాన్ని అభినందించారు’’ అన్నారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ -‘‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకుంటున్న వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం చేశారు. విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement