ప్రభాస్.. రిలీజ్ వాయిదా వేశాడా..? | Prabhas19 Saaho Teaser | Sakshi
Sakshi News home page

ప్రభాస్.. రిలీజ్ వాయిదా వేశాడా..?

Apr 21 2017 2:12 PM | Updated on Oct 3 2018 7:48 PM

ప్రభాస్.. రిలీజ్ వాయిదా వేశాడా..? - Sakshi

ప్రభాస్.. రిలీజ్ వాయిదా వేశాడా..?

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి ఫేం సంపాదించుకున్న యంగ్ హీరో ప్రభాస్ మరోసారి బాహుబలిగా అభిమానులను అలరించడానికి

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి ఫేం సంపాదించుకున్న యంగ్ హీరో ప్రభాస్ మరోసారి బాహుబలిగా అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 28న బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే సినిమా రిలీజ్ కన్నా ముందే ప్రభాస్ నెక్ట్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, బాహుబలి 2 తో పాటు టీజర్ ను రిలీజ్ చేస్తారన్న వార్త యంగ్ రెబల్ స్టార్ అభిమానులను ఖుషీ చేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం 23న రిలీజ్ చేస్తారని భావించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం లేదని తెలుస్తోంది. అంతేకాదు బాహుబలి 2 సినిమాతో పాటు ప్రభాస్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన టీజర్ మాత్రమే రిలీజ్ చేయనున్నారు. టైటిల్ ను కూడా మరికొద్ది రోజులు తరువాత ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే ఇంత వరకు ఈ విషయాలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందిచలేదు.

Advertisement
 
Advertisement
Advertisement