నాలుగు రోజుల్లో ప్రభాస్ 19 ఫస్ట్ లుక్..! | prabhas, sujeeth movie first look release date | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో ప్రభాస్ 19 ఫస్ట్ లుక్..!

Apr 19 2017 3:32 PM | Updated on Sep 5 2017 9:11 AM

నాలుగు రోజుల్లో ప్రభాస్ 19 ఫస్ట్ లుక్..!

నాలుగు రోజుల్లో ప్రభాస్ 19 ఫస్ట్ లుక్..!

బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా పనుల్లో వేగం పెంచాడు. ఇప్పటికే ఈ సినిమాకు

బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా పనుల్లో వేగం పెంచాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ చేసిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ను బాహుబలి రిలీజ్ కన్నా ఐదు రోజుల ముందే విడుదల చేస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహో అనే టైటిల్ను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం టీజర్కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అదే రోజు ప్రభాస్ లుక్తో పాటు టైటిల్ను కూడా రివీల్ చేయనున్నారు. తరువాత బాహుబలి 2 సినిమాతో పాటు టీజర్ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ అవుతున్న తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ప్రభాస్ 19 టీజర్ను రిలీజ్ చేస్తున్నారు.

ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శంకర్ ఇషాన్ లాయ్లు సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ తారను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement