సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

Prabhas Saaho First Day Collection Prediction - Sakshi

బాహుబలి సిరీస్‌ తరువాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్‌ చిత్రంగా మునుపెన్నడూ చూడని యాక్షన్‌ ఎపిసోడ్‌తో సాహో రిలీజ్‌ అవ్వడంతో రికార్డులు బద్దలు అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో.. మొదటి రోజే వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తుందని ట్రేడ్‌ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
(‘సాహో’ మూవీ రివ్యూ)

జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడటంతో.. అవేంజర్‌ ఎండ్‌గేమ్(53కోటు​)‌, థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌(52.25) రికార్డులను క్రాస్‌ చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు కాస్త నెగెటివ్‌ టాక్‌ కూడా రావడంతో సినిమా వసూళ్లపై ప్రభావం చూపేలా ఉందని అంటున్నారు. కానీ ఫస్ట్‌ డే కలెక్షన్లలో మాత్రం రికార్డులు సృష్టించడం​ ఖాయమనిపిస్తోంది.

ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి దాదాపు 60-70కోట్లు కలెక్ట్‌ చేయవచ్చని తెలుస్తోంది. తెలుగులో 35, హిందీలో 15-20, తమిళంలో 15కోట్లు మలయాళంలో 5కోట్ల వరకు వసూళ్లను సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. యూవీ క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top