ప్రాక్టీస్‌ @ పది గంటలు

Prabhas reduced the weight of 7 to 8 kg for Saho - Sakshi

వెండితెరపై యాక్షన్‌ సీన్‌లోకి ప్రభాస్‌ దిగితే ఆడియన్స్‌ విజిల్స్‌తో థియేటర్‌ మోత మోగిపోతుంది. ప్రభాస్‌ ఫైట్స్‌ ఆ రేంజ్‌లో ఉంటాయి. ఆడియన్స్‌ను ఇంతలా ఎగై్జట్‌ చేసే ఈ ఫైట్స్‌ కోసం ఆఫ్‌స్క్రీన్‌లో హీరోలు బాగానే కష్టపడతారు. తన తాజా చిత్రం ‘సాహో’లోని యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రభాస్‌ కొన్ని రోజులు దాదాపు పది గంటలకు పైగా ప్రాక్టీస్‌ చేశారట. దీన్ని బట్టి ‘సాహో’ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ ఏ రేంజ్‌లో ఆడియన్స్‌కి కిక్‌ ఇస్తాయో ఊహించుకోవచ్చు.

హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్ని బెట్స్‌ ‘సాహో’ ఫైట్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేశారు. అలాగే ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారు.  సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ ఇన్ఫార్మర్‌గా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాను దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ‘సాహో’ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top