‘రాధేశ్యామ్‌’ రికార్డు!

Prabhas Radhe Shyam Movie First Look Creates Record - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం విడుదల చేసిన ‘మొదటి లుక్’‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. ట్విటర్‌లో నిన్న టాప్‌ ట్రెండింగ్‌లో చోటుదక్కించుకోవడమే కాకుండా తక్కువ సమయంలో సింగిల్‌ హాష్‌ట్యాగ్‌తో 3.8 మిలియన్లకు పైగా ట్వీట్లు సాధించి రికార్డు సృష్టించింది. సినిమా పరిశ్రమకు చెందిన వారు ట్విటర్‌ ద్వారా ‘రాధేశ్యామ్‌’ చిత్రయూనిట్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలపడంతో #RadheShyam హాష్‌ట్యాగ్‌ హవా కొనసాగింది. ఇక ‘బాహుబ‌లి: ది బిగినింగ్’ సినిమా విడుదలై శుక్రవారానికి ఐదేళ్లు పూర్తవడంతో ప్రభాస్‌ పేరుతో పలు హాష్‌ట్యాగ్‌లు నిన్నంతా ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. రీట్వీట్స్‌, కామెంట్స్‌, ఫొటోలు, వీడియోలతో నిన్నంతా సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ అభిమానులు సందడి చేశారు. 

‘రాధేశ్యామ్‌’ సినిమాను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తోంది.  

చదవండి: ప్ర‌భాస్ సాధించిన ఐదు అంశాలు

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top