'సాహో' ప్రభాస్..! | Prabhas Next Movie Title Saahoo | Sakshi
Sakshi News home page

'సాహో' ప్రభాస్..!

Apr 8 2017 12:36 PM | Updated on Jul 17 2019 9:52 AM

'సాహో' ప్రభాస్..! - Sakshi

'సాహో' ప్రభాస్..!

త్వరలో బాహుబలి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో

త్వరలో బాహుబలి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రభాస్తో సినిమా చేసేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎడ్వంచరస్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బాహుబలి ఫ్లేవర్ అద్దే పనిలో పడ్డారు చిత్రయూనిట్. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్, నెక్ట్స్ ప్రాజెక్ట్ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహో అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ టైటిల్ను నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు బాహుబలి 2తో పాటు సాహో టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు, ప్రస్తుతం టీజర్కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ప్రభాస్, సుజిత్ల సినిమా టైటిల్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement