బాహుబలి 2 కన్నా ఒకరోజు ముందే..! | Prabhas Next Movie teaser release date | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 కన్నా ఒకరోజు ముందే..!

Apr 9 2017 12:46 PM | Updated on Sep 5 2017 8:22 AM

బాహుబలి 2 కన్నా ఒకరోజు ముందే..!

బాహుబలి 2 కన్నా ఒకరోజు ముందే..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా బాహుబలి 2. తొలి భాగంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా బాహుబలి 2. తొలి భాగంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై సరికొత్త చరిత్ర సృష్టించిన బాహుబలి టీం ఇప్పుడు రెండో భాగంతో తమ రికార్డ్లను తామే బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 28న బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. అయితే బాహుబలి 2 రిలీజ్కు ఒక్క రోజు ముందే తన అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు హీరో ప్రభాస్.

బాహుబలి తరువాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వంఛరస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ షూటింగ్ను కూడా పూర్తి చేసారట. అంతేకాదు ముందుగా అనుకున్నట్టుగా బాహుబలి సినిమాతో పాటు కాకుండా ఒక్క రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 27 సాయంత్రమే ప్రభాస్, సుజిత్ల సినిమా టీజర్ను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి కావటంతో ప్రస్తుతం గ్రాఫిక్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించే పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. ప్రభాస్ సొంతం నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సాహో టైటిల్ను పరిశీలిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ హీరోయిన్గా కనిపించే అవకాశం ఉంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement