ప్రభాస్‌ కళ్లు అందంగా ఉంటాయి: శ్రియ

Prabhas Has Mesmerising Eyes Says Shriya saran - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ హీరోలలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ముందు వరుసలో ఉంటాడు. బాహుబలి, సాహో సినిమాలతో తన స్థాయిని మరోసారి  నిరూపించాడు. ఇక అభిమానుల విషయానికొస్తే జాతీయ స్థాయిలో‌ ప్రభాస్‌కు ఫాలోవర్స్‌ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్‌ శ్రియ సరన్‌ కూడా చేరిపోయారు. ‘ప్రభాస్‌ కళ్లు నాకు చాలా ఇష్టం. ఆ కళ్లు ఎవరినైనా ఆకర్షించి మంత్రముగ్దులను చేస్తాయి’ అని శ్రియ అన్నారు. ఇటీవల అభిమానులతో జరిగిన ఇంటరాక్షన్‌లో ప్రభాస్‌కు సంబంధించిన ప్రస్తావన రావడంతో  శ్రియ ఈ విషయాన్నివెల్లడించారు. 2005లో విడుదలైన ‘చత్రపతి’ సినిమాలో ప్రభాస్‌, శ్రియ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫిస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీని కన్నడం, బెంగాలీలో సైతం రీమేక్‌ చేశారు. (అజయ్‌ దేవగన్‌కి జోడీగా శ్రియ)

అదే విధంగా శ్రియా తన రాబోయే చిత్రాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ మూవీలో నటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ భార్యగా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీళ్లిద్దరూ హిందీ ‘దృశ్యం’లో కలిసి నటించారు. కాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో 2021 జనవరిలో విడుదల కానుంది. (రష్యాలోనూ ఇరగదీస్తున్న బాహుబలి-2)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top