సాహో విడుదలపై సస్పెన్స్‌

Prabhas Saaho Latest About The Futuristic Action Film - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సాహో విడుదల ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి చెక్కిన బాహుబలి రెండు భాగాల్లో అభిమానులను ఉర్రూతలూగించిన ప్రభాస్‌ను మరోసారి తెరపై చూడాలని ఉవ్విళ్లూరుతున్న అభిమానులకు నిరాశ ఎదురవనుంది. సుజీత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సాహో షూటింగ్‌ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టనుంది. తొలుత ఈ ఏడాది దీపావళికి సాహో ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని అంచనాలు వెల్లడయ్యాయి. తాజా సమాచారం మేరకు సాహో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.

మరోవైపు పూజా హెగ్డేతో ఇంకా టైటిల్‌ వెల్లడించని ప్రభాస్‌ 20వ చిత్రం సాహో కంటే ముందుగా విడుదల కావచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే బాహుబలి తర్వాత సాహోనే తొలుత రిలీజ్‌ కావాలని ప్రభాస్‌ పట్టుబడుతున్నట్టు తెలిసింది. సాహోలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ నటిస్తుండగా, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, మందిరా బేడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top