బాహుబలిని తట్టుకున్న పవర్‌ పాండి | Power Pandey to hit talk | Sakshi
Sakshi News home page

బాహుబలిని తట్టుకున్న పవర్‌ పాండి

May 7 2017 11:29 PM | Updated on Sep 5 2017 10:38 AM

బాహుబలిని తట్టుకున్న పవర్‌ పాండి

బాహుబలిని తట్టుకున్న పవర్‌ పాండి

భారీ బడ్జెట్‌ చిత్రం ‘బాహుబలి–2’ విడుదలైన సమయంలో మరో సినిమా రిలీజ్‌ అంటే రిస్కే.

భారీ బడ్జెట్‌ చిత్రం ‘బాహుబలి–2’ విడుదలైన సమయంలో మరో సినిమా రిలీజ్‌ అంటే రిస్కే. అందుకే ఈ సినిమా విడుదలైన ఏప్రిల్‌ 28న వేరే ఏ తెలుగు సినిమాలనూ విడుదల చేయలేదు. అంతకు వారం క్రితం రిలీజైన వాటిలో కూడా ఆశించిన ఫలితాన్ని సాధించినవి లేవు. కానీ, తమిళంలో మాత్రం ‘పవర్‌ పాండ్‌’ చిత్రం ‘బాహుబలి–2’ని తట్టుకుని నిలబడింది. హీరో ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదలైంది. మొదటి రోజునే హిట్‌ టాక్‌ తెచ్చుకోవ డంతో ప్రేక్షకాదరణ పెరిగింది.

‘బాహుబలి–2’ విడుదలయ్యాక కూడా ఈ సినిమా వసూళ్లు నిలకడగా ఉండటం విశేషం. ఈ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ధనుష్‌ సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఫస్ట్‌ పార్ట్‌లో సీనియర్‌ నటుడు రాజ్‌కిరణ్‌ టైటిల్‌ రోల్‌ చేశారు. ధనుష్‌ అతిథి పాత్ర చేశారు. సీక్వెల్‌లో మామ రజనీకాంత్‌ను నటింపజేయాలని ధనుష్‌ అనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement