చిన్నారుల కేన్సర్‌ చికిత్సకు ఖర్చు నేను భరిస్తా.. | Pooja Hegde Visit Golf Club in Hyderabad | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ను తరిమికొడదాం

Jan 20 2020 9:07 AM | Updated on Jan 20 2020 9:07 AM

Pooja Hegde Visit Golf Club in Hyderabad - Sakshi

గోల్కొండ గోల్ఫ్‌ క్లబ్‌లో హీరోయిన్‌ పూజా హెగ్డే సందడి చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కేన్సర్‌ క్రూసేడర్స్‌ ఇన్విటేషన్‌ కప్‌ పోస్టర్‌ను ఆవిష్కరించింది. కాసేపు గోల్ఫ్‌ఆడి అందర్నీ అలరించింది.

గోల్కొండ: కేన్సర్‌పై అవగాహన కల్పించడంలో క్యూర్‌ ఫౌండేషన్‌ చేస్తున్న సేవలకు తన పూర్తి సహకారం ఉంటుందని సినీనటి పూజాహెగ్డే అన్నారు. క్యూర్‌ ఫౌండేషన్, అపోలో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న 6వ కేన్సర్‌ క్రూసెడర్స్‌ ఇన్విటేషన్‌ కప్‌ పోస్టర్‌ను ఆదివారం గోల్కొండ నయాఖిలాలోని గోల్ఫ్‌ క్లబ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూజాహెగ్డే మాట్లాడుతూ సదుద్దేశంతో నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో తాను కూడా భాగమైనందుకు సంతోషంగానూ, గర్వకారణంగానూ ఉందన్నారు. ఇద్దరు చిన్నారుల కంటికేన్సర్‌ చికిత్సకు అయ్యే ఖర్చు తాను భరిస్తానన్నారు. హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కెప్టెన్‌ విక్రమ్‌ దేవ్‌రావ్‌ మాట్లాడుతూ క్రూసెడర్స్‌ కప్‌ నిర్వహణకు తమ గోల్ఫ్‌ కోర్స్‌ వేదికైనందుకు గర్విస్తున్నామన్నారు.

ఈ టోర్నమెంట్‌లో ప్రముఖ గోల్ఫర్లు పాల్గొంటారని, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తామన్నారు.క్యూర్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.విజయ్‌ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫౌండేషన్‌ ద్వారా 1300 మందికి  కేన్సర్‌ చికిత్సలు అందించామన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన వాక్‌ ఆఫ్‌ లైఫ్‌ ర్యాంప్‌ నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో పీవీ.సింధు, పుల్లెల గోపిచంద్, సంగీతారెడ్డి, సినీనటి రాఖీఖన్నా హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌జీఏ కెప్టెన్‌ భాస్కర్‌ రెడ్డి, గౌరవ కార్యదర్శి కె.శ్రీకాంత్‌ రావు, ప్రైడ్‌ హోండా ఎండీ సురేష్‌రెడ్డి, హెచ్‌ఐసీసీ అండ్‌ నోవాటెల్‌ జీఎం మనీష్‌ దయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం పూజాహెగ్డే ఓ లాంగ్‌డ్రైవ్‌తో టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పూజా.. ది ప్లేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement