డబ్బు కోసం ఏది పడితే అది చేయను | Pooja Hegde refuses to endorse weight loss pills! | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం ఏది పడితే అది చేయను

Dec 23 2017 1:05 AM | Updated on May 29 2019 2:58 PM

Pooja Hegde refuses to endorse weight loss pills!  - Sakshi

‘‘ఈ బిళ్లలు మింగండి. ఎంచక్కా సన్నబడిపోండి’ అనే యాడ్‌ చూస్తే.. లావుగా ఉన్నవాళ్లల్లో చాలామంది ఎట్రాక్ట్‌ అయిపోతారు. ఏముంది? ఓ మందు బిళ్లే కదా.. మింగేస్తే పోలా? అనుకుంటారు. డబ్బు గురించి ఆలోచించకుండా కొనేస్తారు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి కూడా ఆలోచించరు. కానీ, ప్రమోట్‌ చేసేవాళ్లు మంచివాళ్లైతే ఆలోచిస్తారు. పూజా హెగ్డే ఈ కేటగిరీలోకే వస్తారు. ఓ ప్రముఖ ఉత్పత్తిదారులు ‘వెయిట్‌ లాస్‌ పిల్‌’ను ప్రమోట్‌ చేయమని పూజా హెగ్డేని సంప్రదించారు. భారీ పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ, పూజా ఆ ఆఫర్‌ని తిరస్కరించారు.

డబ్బు కోసం ఏది పడితే అది చేయనని తెగేసి చెప్పారు. ‘‘స్ట్రిక్ట్‌ డైట్, యోగ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ ఫాలో అయితే బరువు తగ్గటం పెద్ద కష్టం కాదు. వెయిట్‌ లాస్‌కు నేచురల్‌ పద్ధతిని ఫాలో అవ్వడమే మంచిది. టాబ్లెట్స్‌ యూజ్‌ చేయడం వల్ల బరువు తగ్గుతారని మిస్‌ గైడ్‌ చేయడం నాకిష్టం లేదు. ఆరోగ్యం పట్ల అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ  తీసుకోవాలి. ఈ రోజుల్లో హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌ అని గుర్తించుకోవాలి.  ఎట్‌లీస్ట్‌ 45 మినిట్స్‌ డైలీ వ్యాయామం చేసేలా లైఫ్‌స్టైల్‌ను చేంజ్‌ చేసుకోవాలి. అప్పుడే హెల్త్‌ పరంగా గుడ్‌ రిజల్ట్‌ ఉంటుంది’’ అని పేర్కొన్నారు పూజా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement