దర్శకుడు చిరంజీవి | Pic Talk: Megastar Directs Vinayak | Sakshi
Sakshi News home page

దర్శకుడు చిరంజీవి

Dec 13 2016 11:23 PM | Updated on Sep 4 2017 10:38 PM

దర్శకుడు చిరంజీవి

దర్శకుడు చిరంజీవి

చిరంజీవి హీరోగా వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్‌’లో దర్శకుడు ఓ సీన్‌లో నటించారు.

చిరంజీవి హీరోగా వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్‌’లో దర్శకుడు ఓ సీన్‌లో నటించారు. ఆ సినిమా సూపర్‌హిట్‌. బహుశా... ఆ సెంటిమెంట్‌ అనుకోవాలో? మరో కారణమో? చిరంజీవి, వినాయక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’లోనూ దర్శకుడు అతిథి పాత్ర చేశారు. విశేషం ఏంటంటే... వినాయక్‌ నటించిన సన్నివేశానికి చిరంజీవి దర్శకత్వం వహించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో సినిమా చిత్రీకరణకు ముగింపు పలుకుతూ, ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

ఈ లాస్ట్‌ షాట్‌కు చిరంజీవి అఫిషియల్‌గా ‘యాక్షన్‌... కట్‌’ చెప్పారు. అన్నట్టు... తమిళంలో దర్శకుడు మురుగదాస్‌ తీసిన ‘రమణ’కు తెలుగు రీమేక్‌ ‘ఠాగూర్‌’. ఈ ‘ఖైదీ నంబర్‌ 150’ మురుగదాస్‌ తీసిన మరో సినిమా ‘కత్తి’కి తెలుగు రీమేక్‌. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీల్లో పాటల్ని క్రిస్మస్‌కి, చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement