'నన్ను దత్తత అడుగుతున్నారు' | People want to adopt me, Deepika on 'Piku' success | Sakshi
Sakshi News home page

'నన్ను దత్తత అడుగుతున్నారు'

May 16 2015 1:06 PM | Updated on Apr 3 2019 6:23 PM

'నన్ను దత్తత అడుగుతున్నారు' - Sakshi

'నన్ను దత్తత అడుగుతున్నారు'

గత వారం విడుదలైన పీకూ చిత్రం సక్సెస్ తో బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఆనందం వ్యక్తం చేస్తోంది.

ముంబై:గత వారం విడుదలైన పీకూ చిత్రం సక్సెస్ తో బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆ చిత్రం విడుదలైన అనంతరం చాలా మంది నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని.. అందులో ఎక్కువ శాతం మంది తనను దత్తత తీసుకుంటామని అడుగుతున్నారని దీపికా తెలిపింది. షూజిత్‌ సర్కార్‌ దర్శకత్వం వహించిన పీకూ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురిగా విభిన్నమైన పాత్రలో కనిపించిన దీపికా నటనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక ప్రక్క ఆఫీస్ పని చేసుకుంటూ మరో ప్రక్క కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే దీపికా పాత్ర. తాజాగా ఐఏఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్యూలో దీపిక పలు విషయాలను వెల్లడించింది.

 

ఈ చిత్రంలో తండ్రికి కూతురికి మధ్య సంబంధం సహజసిద్ధంగా  ఉందని.. ఇది తప్పకుండా ప్రేక్షకులకు చేరవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. పీకూ విడుదల తరువాత చాలా మంది తనను దత్తత తీసుకోవాలని కోరడం నిజంగా చాలా ఫన్నీగా ఉందని తెలిపింది.. నా సినిమాలకు తన కుటుంబ సభ్యులే సిసలైన విమర్శకులని ఈ సందర్భంగా దీపిక స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement