చిరు బర్త్ డే పార్టీలో పవన్ సతీమణి | Pawan's wife tremors at Chiru 61st bash | Sakshi
Sakshi News home page

చిరు బర్త్ డే పార్టీలో పవన్ సతీమణి

Aug 23 2016 7:20 PM | Updated on Mar 22 2019 5:33 PM

చిరు బర్త్ డే పార్టీలో పవన్ సతీమణి - Sakshi

చిరు బర్త్ డే పార్టీలో పవన్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సినీప్రముఖులు, అభిమానుల మధ్య హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో మంగళవారం సాయంత్రం ఘనంగా వేడుక నిర్వహించింది మెగా ఫ్యామిలీ.

మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలు సోమవారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సినీప్రముఖులు, అభిమానుల మధ్య హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో నిన్న సాయంత్రం ఘనంగా వేడుక నిర్వహించింది మెగా ఫ్యామిలీ. కాగా పవన్ సతీమణి అన్నా లెజ్నోవా పవన్ తరఫున ఈ పార్టీలో పాల్గొన్నారట. హోటల్ వద్ద ఆమెకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది.

బెంగళూరులో జరిగిన శ్రీజ వివాహ వేడుకల్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పవన్ సతీమణి. 'సర్దార్ గబ్బర్సింగ్' షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా పవన్.. శ్రీజ వివాహానికి హాజరుకాలేకపోయారు. ప్రస్తుతం మెగాస్టార్ పుట్టినరోజు వేడుకకు కూడా ఆయన రాలేకపోవడంతో అన్నా లెజ్నోవా ఆ లోటును భర్తీ చేశారు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ అంతా అన్నా లెజ్నోవా రాక గురించే మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement