పవన్ కొత్త సినిమా.. లిస్ట్లో మరో టైటిల్ | Pawan, Trivikram New movie title | Sakshi
Sakshi News home page

పవన్ కొత్త సినిమా.. లిస్ట్లో మరో టైటిల్

May 11 2017 12:39 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కొత్త సినిమా.. లిస్ట్లో మరో టైటిల్ - Sakshi

పవన్ కొత్త సినిమా.. లిస్ట్లో మరో టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సర్థార్ గబ్బర్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావటంతో ఈ సారి చేయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పవన్. ముఖ్యంగా అభిమానులు పవన్ నుంచి ఆశించే ఫన్, యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను చిత్రయూనిట్ ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పేర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. దేవుడే దిగి వస్తే, ఇంజనీర్ బాబు, మాధవుడు, పరదేశ ప్రయాణం లాంటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా ఈ లిస్ట్ లో మరో టైటిల్ చేరిపోయింది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోకుల కృష్ణుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే ఇంత వరకు చిత్రయూనిట్ మాత్రం ఏ టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం షూటింగ్ మీదే దృష్టి పెట్టిన పవన్ టీం, మరో షెడ్యూల్ పూర్తయిన తరువాత టైటిల్ ను ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యిందట. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ కీలక పాత్రలో అలరించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement