పవన్ కొత్త సినిమా ప్రారంభం | Pawan Kalyan's new film launched | Sakshi
Sakshi News home page

పవన్ కొత్త సినిమా ప్రారంభం

Oct 11 2016 1:00 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కొత్త సినిమా ప్రారంభం - Sakshi

పవన్ కొత్త సినిమా ప్రారంభం

విజయదశమి సందర్భంగా హీరో పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది.

విజయదశమి సందర్భంగా హీరో పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. తమిళంలో అజిత్, శ్రుతిహాసన్ జంటగా నటించిన వేదలం సినిమాకు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. సినిమా ప్రారంభోత్సవం చాలా సింపుల్‌గా జరిగిందని, కేవలం పవన్ కల్యాణ్, దర్శకుడు నేశన్, నిర్మాత ఏఎం రత్నం మాత్రమే ఇందులో పాల్గొన్నారని సినిమా వర్గాలు తెలిపాయి. గతంలో జిల్లా సినిమా తీసి మంచి విజయం సాధించిన నేశన్.. ఇప్పుడు తెలుగులో పవన్‌తోనే ఆరంగేట్రం చేస్తున్నాడు.

కాగా, పవన్ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు కూడా తమిళ రీమేక్‌లే. అజిత్ ఇంతకుముందు తీసిన వీరం రీమేక్‌గా కాటమరాయుడు చేస్తున్నాడు. దీనికి గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు వేదలం రీమేక్‌ చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement