ఖైదీపై పవన్ ట్వీట్.. ఇంతకీ వస్తున్నట్టా..రానట్టా..? | Pawan Kalyan tweets Mega Star Chiranjeevi Cinema | Sakshi
Sakshi News home page

ఖైదీపై పవన్ ట్వీట్.. ఇంతకీ వస్తున్నట్టా..రానట్టా..?

Jan 7 2017 2:17 PM | Updated on Mar 22 2019 5:33 PM

ఖైదీపై పవన్ ట్వీట్.. ఇంతకీ వస్తున్నట్టా..రానట్టా..? - Sakshi

ఖైదీపై పవన్ ట్వీట్.. ఇంతకీ వస్తున్నట్టా..రానట్టా..?

మెగా మూవీపై పవన్ మౌనం వీడాడు. ఇప్పటి వరకు మెగాస్టార్ రీ ఎంట్రీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవర్ స్టార్ తాజాగా ఖైదీ నంబర్ 150 యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపాడు.

మెగా మూవీపై పవన్ మౌనం వీడాడు. ఇప్పటి వరకు మెగాస్టార్ రీ ఎంట్రీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవర్ స్టార్ తాజాగా ఖైదీ నంబర్ 150 యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపాడు. ' చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు'. అంటూ ట్వీట్ చేశాడు.

అయితే ఈ ట్వీట్ లో సాయంత్రం జరగబోయే వేడుకకు తాను వచ్చేదీ రానిదీ క్లారిటీ ఇవ్వలేదు. శుక్రవారం సాయంత్రం నుంచి పవన్ ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతాడన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పవన్ స్వయంగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారంటున్నారు అభిమానులు. పనవ్ మాత్రం తన ట్వీట్ లో ఎక్కడా వేడుకకు సంబంధించి స్పందించకపోవటంతో మరోసారి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు వస్తాడా.. రాడా.. తెలియాలంటే సాయంత్ర ఫంక్షన్ మొదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement