పవన్, దాసరిల 'బోస్'..? | Pawan Kalyan, Dasari narayana rao movie title is Bose | Sakshi
Sakshi News home page

పవన్, దాసరిల 'బోస్'..?

Sep 14 2016 2:02 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్, దాసరిల 'బోస్'..? - Sakshi

పవన్, దాసరిల 'బోస్'..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు స్వయంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్కు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు స్వయంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్కు తగ్గ కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్లో 38వ సినిమాగా పవన్తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందన్న టాక్ మొదలైంది.

ఈ నేపథ్యంలో తాజాగా దాసరి, బోస్ అనే టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పవన్ దాసరిలకు సినీ రంగంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఈ అంశాలను ప్రతిభించేలాగే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే బోస్ అనే టైటిల్పై తారక ప్రభు ఫిలింస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement