మరోసారి పల్లెటూరి యువతిగా.. | parvathi menon pair with udhayanidhi stalin new movie | Sakshi
Sakshi News home page

మరోసారి పల్లెటూరి యువతిగా..

Aug 13 2017 7:26 PM | Updated on Sep 17 2017 5:29 PM

మరోసారి పల్లెటూరి యువతిగా..

మరోసారి పల్లెటూరి యువతిగా..

పల్లెటూరి యువతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించిన పార్వతీ మీనన్ తాజాగా ఉదయనిధి స్టాలిన్తో నటిస్తున్న చిత్రంలో కూడా గ్రామీణ యువతిగా కనిపించనుందట.

పల్లెటూరి యువతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించిన పార్వతీ మీనన్ తాజాగా ఉదయనిధి స్టాలిన్తో నటిస్తున్న చిత్రంలో కూడా గ్రామీణ యువతిగా కనిపించనుందట. ఇందులో పార్వతీమీనన్ పాత్రకు మరింత ప్రాముఖ్యత ఇచ్చారట. ఉదయనిధి స్టాలిన్తో హీరోయన్ పార్వతీ మీనన్ రొమాన్స్ చేయనుంది. అప్పుడప్పుడు కోలీవుడ్లో మెరిసిపోతున్న మాలీవుడ్ అమ్మడు పార్వతీమీనన్.

అప్పుడెప్పుడో పూ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి  ఆ తరువాత ధనుష్తో మరియాన్ చిత్రంలో చాలా సన్నిహితంగా నటించి వార్తల్లోకెక్కింది. పూ చిత్రంలో పల్లెటూరి యువతిగా మొదటిసారి నటించింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని బెంగళూర్ నాట్కళ్, కమలహాసన్తో ఉత్తమ విలన్ చిత్రాల్లో మెరిసింది. తొలి చిత్రంలోనే మంచి నటిగా నిరూపించుకుంది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ భామ నటించిన తమిళ చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు.

తనకి వచ్చిన అవకాశాలను అంగీకరించడం లేదట. మాతృభాషలో బాగానే అవకాశాలు వస్తున్నాయట. కాగా మరోసారి తమిళ సినీ అభిమానులను పలకరించడానికి పార్వతీమీనన్ రెడీ అవుతోంది. వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన తాజా చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం  గత శుక్రవారం  తెరపైకి వచ్చింది.

అంతకుముందే ఆయన తన తరువాత చిత్రానికి రెడీ అయిపోయారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలేకేరళలోని షూకుట్రాళంలో  ప్రారంభమైంది. సినిమా పేరును ఇంకా నిర్ణయించలేదు.  ఈ చిత్రంలో హీరోయిన్గా పార్వతీమీనన్ నటించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement