పార్టీలు... పబ్బులు... నాకిష్టం లేదండీ! | parties, pubs are i dont like..shruthihasaan | Sakshi
Sakshi News home page

పార్టీలు... పబ్బులు... నాకిష్టం లేదండీ!

Jul 2 2017 10:49 PM | Updated on Sep 18 2019 2:55 PM

పార్టీలు... పబ్బులు... నాకిష్టం లేదండీ! - Sakshi

పార్టీలు... పబ్బులు... నాకిష్టం లేదండీ!

పార్టీలు... పబ్బులు...నాకిష్టం లేదండీ!...అంటున్నారు శ్రుతీహాసన్‌. ఎందుకు? అని ఆమెను అడిగితే... పార్టీకి వెళితే షూటింగ్‌కి వెళ్లినట్టే అనిపిస్తుందట.

...అంటున్నారు శ్రుతీహాసన్‌. ఎందుకు? అని ఆమెను అడిగితే... పార్టీకి వెళితే షూటింగ్‌కి వెళ్లినట్టే అనిపిస్తుందట. ఇదెక్కడి విడ్డూరం? మాంచి మ్యూజిక్, మందు, చిందు... పార్టీల్లో ఇవేగా ఉండేది! మరి, శ్రుతి షూటింగ్‌ అంటున్నారేంటి? చాలామందికి సహజంగా వచ్చే డౌట్‌ ఇదే! దీన్నే శ్రుతీహాసన్‌ ముందుంచితే... ‘‘పార్టీలకు వెళితే అక్కడ ఎవరెవరో నాకు పరిచయం లేనోళ్లు, తెలీనోళ్లు కనిపిస్తారు.

నెర్వస్‌గా ఉంటుందప్పుడు. లేని నవ్వును తెచ్చుకుని నటించాలి. అప్పుడక్కడ సరదా ఏముంటుంది? పైగా, అక్కడ కూడా నేను చేసే సినిమాల గురించే అడుగుతుంటారు. అందుకే, పార్టీలు... పబ్బులు... అంటే నాకు ఇష్టం ఉండదు’’ అన్నారు. ముంబయ్‌లో పబ్బులు, పార్టీ కల్చర్‌ ఎక్కువ! ప్రస్తుతం ముంబయ్‌లోనే ఉంటున్నారామె. పార్టీలకు దూరంగా అక్కడ ఎలా ఉంటున్నారు? ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? అని శ్రుతీని ప్రశ్నిస్తే... ‘‘షూటింగ్‌ షెడ్యూల్స్‌ మధ్య నాకు చాలా తక్కువ ఫ్రీ టైమ్‌ దొరుకుతోంది. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో స్పెండ్‌ చేస్తా. వాళ్లే నా రీ–చార్జ్‌ బ్యాటరీస్‌’’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement