సానియా మీర్జాగా...! | Parineeti to Play Sania Mirza | Sakshi
Sakshi News home page

సానియా మీర్జాగా...!

Aug 5 2015 10:57 PM | Updated on Sep 3 2017 6:50 AM

సానియా మీర్జాగా...!

సానియా మీర్జాగా...!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాగా పరిణీతి చోప్రా నటించనున్నారా? ఆ చాన్స్ ఉందని బాలీవుడ్‌లో ఓ వార్త ప్రచారంలో ఉంది.

 టెన్నిస్ స్టార్ సానియా మీర్జాగా పరిణీతి చోప్రా నటించనున్నారా? ఆ చాన్స్ ఉందని బాలీవుడ్‌లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఫర్హాన్ అక్తర్ నటించిన ‘బాగ్ మిల్కా బాగ్’, ప్రియాంకా చోప్రా చేసిన ‘మేరీ కోమ్’ వంటి బయోపిక్స్  విజయం సాధించాక  అగ్ర నటుల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ అందరూ ఈ తరహా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకురాలు ఫరాఖాన్ ఇప్పుడు సానియా మీర్జా  జీవితాన్ని తెర మీద ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సానియాకి మాత్రం తన జీవితం ఆధారంగా సినిమా వస్తే ఓకేనట. అయితే, టైటిల్ రోల్‌ను పరిణీతి చోప్రా చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడుతున్నారు. మరి... నిజంగానే సానియా జీవితం వెండితెరకొస్తుందా? ఒకవేళ వస్తే, అందులో సానియాగా ఎవరు నటిస్తారు? తదితర ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement