‘పరిచయం’ ఫస్ట్‌ డే చూస్తా | Parichayam Audio Launch Event | Sakshi
Sakshi News home page

‘పరిచయం’ ఫస్ట్‌ డే చూస్తా

Jul 16 2018 1:05 AM | Updated on Jul 12 2019 4:40 PM

Parichayam Audio Launch Event - Sakshi

సిమ్రత్‌ కౌర్, విరాట్‌ కొండూరు, లక్ష్మీకాంత్‌ చెన్నా, మారుతి, రియాజ్‌

‘‘పరిచయం’ టైటిల్‌ బాగుంది. టీమ్‌ వర్క్‌తో సినిమాను కంప్లీట్‌ చేశారు. పృథ్వీ(పెళ్లి ఫేమ్‌)ఎనర్జిటిక్‌ ఆర్టిస్ట్‌. ఈ సినిమాను ఫస్ట్‌డే చూస్తా. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీతో రానున్న ఈ సినిమా విజయం సాధించాలి. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు. విరాట్‌ కొండూరు, సిమ్రత్‌ కౌర్‌ జంటగా లక్ష్మీకాంత్‌ చెన్నా దర్శకత్వంలో రియాజ్‌ నిర్మించిన ‘పరిచయం’ ఈ నెల 21న విడుదల కానుంది. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు. దర్శకుడు లక్ష్మీకాంత్‌ చెన్నా మాట్లాడుతూ– ‘‘లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది.

స్ట్రాంగ్‌ ఎమోషన్‌ కూడా ఉంటుంది. మా సినిమాను సపోర్ట్‌ చేసేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన నాని, శర్వానంద్, సాయిపల్లవి, హరీష్‌ శంకర్, మారుతిగార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘దాదాపు 8ఏళ్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాతో నా కల నేరవేరింది. తొలి అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు విరాట్‌. ‘‘ఏడేళ్ల తర్వాత నేను తెలుగులో నటించిన సినిమా ఇది’’ అన్నారు పృథ్వీ. ‘‘మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ సహకారం మరవలేనిది’’ అన్నారు రియాజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement