వ్యవసాయం నేపథ్యంలో పల్లెవాసి | Pallevasi Teaser Released | Sakshi
Sakshi News home page

వ్యవసాయం నేపథ్యంలో పల్లెవాసి

Jan 4 2020 12:56 AM | Updated on Jan 4 2020 12:56 AM

Pallevasi Teaser Released - Sakshi

కల్కి మిత్ర, రాకేందు మౌళి

‘సాహసం శ్వాసగా సాగిపో, కిరాక్‌ పార్టీ’ చిత్రాల ఫేమ్‌ రాకేందు మౌళి కథానాయకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘పల్లెవాసి’. సాయినాథ్‌ గోరంట్ల దర్శకత్వంలో రాంప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పల్లెసీమ నేపథ్యంలో మంచి కథని ఎంచుకొన్న చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు పాటల రచయిత వెన్నెలకంటి.

‘‘అక్షరం మీద ఆధారపడిన కుటుంబం నుంచి వచ్చాను. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘మా సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సాయినాథ్‌ గోరంట్ల. ‘‘పల్లెవాసి’ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాంప్రసాద్‌. ఈ చిత్రానికి కెమెరా: చామంతి లక్ష్మణ్‌రాజ్, సహ నిర్మాత: ఉదయ్‌కుమార్‌ యాదవ్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement