సెల్ఫీలంటూ చావగొడుతున్నారు | Pakistanis pamper me and everyone wants to take a selfie: Om Puri on filming in Pakistan | Sakshi
Sakshi News home page

సెల్ఫీలంటూ చావగొడుతున్నారు

Jan 12 2016 1:21 PM | Updated on Aug 17 2018 2:34 PM

సెల్ఫీలంటూ చావగొడుతున్నారు - Sakshi

సెల్ఫీలంటూ చావగొడుతున్నారు

'నేనొచ్చానని తెలిస్తేచాలు తెలిసినవాళ్లు ఫోన్లమీద ఫోన్లు చేస్తుంటారు. ఎప్పుడైనా బయటికి వెళ్తానా.. సెల్ఫీ దిగాలంటూ అభిమానులు చావగొడుతున్నారు'

- పాకిస్థానీ అభిమానులను ఉద్దేశించి ఓంపురి సరదా వ్యాఖ్య
- 'యాక్టర్ ఇన్ లా'తో దాయాది గడ్డపై సీనియర్ నటుడి అరంగేట్రం

ఇస్లామాబాద్:
తనదైన విలక్షణ శైలితో గొప్ప నటుడిగా పేరుపొందిన ఓంపురి.. తొలిసారి దాయాదిదేశపు వెండితెరపై అలరించనున్నారు. ఆయన నటించిన పాకిస్థానీ చిత్రం 'యాక్టర్ ఇన్ లా' విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా యూనిట్ తో కలిసి సోమవారం ఇస్లామాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థానీలు తనను ఆదరిస్తున్న తీరకు ముగ్థుణ్నవుతున్నానని ఓంపురి అన్నారు.

'పాకిస్థాన్ వచ్చానని తెలిస్తేచాలు తెలిసినవాళ్లు ఫోన్లమీద ఫోన్లు చేస్తుంటారు. ఎప్పుడైనా బయటికి వెళ్తానా.. సెల్ఫీ దిగాలంటూ అభిమానులు చావగొడుతున్నారు. వాళ్లలా అడగటం నాకూ ఇష్టమే' అని ఓంపురి సరదాగా వ్యాఖ్యానించారు. పాకిస్థానీలతో తన బంధం రెండు దశాబ్ధాలనాటిదని, ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న ప్రేమానురాగాలు చూస్తే ఇండియా- పాకిస్థాన్ లు తగువులాడుకోవటం విస్మయం కలిగిస్తుందని, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

40 ఏళ్ల కెరీర్ లో తొలి ఐటమ్ సాంగ్!?
షానీ అర్షద్ ద్వయం సంగీతం అందిస్తున్న 'యాక్టర్ ఇన్ లా' సినిమాలోని నాలుగు పాటల్లో ఒకటి ఐటమ్ సాంగ్. సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్ర పోశిస్తోన్న ఓంపురి ఐటమ్ సాంగ్ లోనూ కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై దర్శకుడు నబీల్ ఖురేషీ మాట్లాడుతూ.. 'అలా ప్రచార జరగటం మంచిదే. ఎందుకంటే 40 ఏళ్ల కెరీర్ లో ఓంపురి ఏనాడూ ఐటమ్ సాంగ్ లో కినిపించలేదు. ఇలానైనా ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో' అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement