పాకిస్థానీ మేక! | pakistan sheep got an award.. | Sakshi
Sakshi News home page

పాకిస్థానీ మేక!

Feb 25 2015 2:15 AM | Updated on Sep 2 2017 9:51 PM

పాకిస్థానీ మేక!

పాకిస్థానీ మేక!

టంగ్ స్లిప్పయి కష్టాలు కొనితెచ్చుకున్నాడు మరాఠీ దర్శకరచయిత కేదార్ షిండే.

టంగ్ స్లిప్పయి కష్టాలు కొనితెచ్చుకున్నాడు మరాఠీ దర్శకరచయిత కేదార్ షిండే. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్‌లో టైగర్ షరాఫ్‌కు కాకుండా పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్‌కు పురస్కారం రావడంపై ఆయన గరమైపోయాడు. అప్పుడైతే ఏమీ మాట్లాడలేదు గానీ... తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వివాదాస్పదమైన వ్యాఖ్య చేసి సంచలనం రేపాడు.

‘బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డు పాకిస్థాన్ మేకకు ఇచ్చే బదులు భారత టైగర్‌కు అందివ్వచ్చుగా’ అంటూ పరోక్షంగా ఫవాద్‌ఖాన్‌ను కసితీరా తిట్టేశాడు. మరాఠా ఫిల్మీ దునియాలో గౌరవప్రదమైన దర్శకరచయితగా పేరొందిన షిండే నోటి నుంచి ఇంత చీఫ్ కామెంట్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదట! అంతటి వ్యక్తి మరింత హుందాగా వ్యవహరించాల్సింది పోయి ఇలా దిగజారిపోవడం బాధాకరమంటూ ఇండస్ట్రీ జనులు చెప్పుకొంటున్నారట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement