బొమ్మరిల్లులా... | Oye inne Released on 15th of this month | Sakshi
Sakshi News home page

బొమ్మరిల్లులా...

Sep 4 2017 12:58 AM | Updated on Sep 17 2017 6:20 PM

బొమ్మరిల్లులా...

బొమ్మరిల్లులా...

భరత్‌ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్‌.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన చిత్రం ‘ఓయ్‌.. నిన్నే’.

భరత్‌ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్‌.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన చిత్రం ‘ఓయ్‌.. నిన్నే’. ఈ నెల 15న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మా సంస్థ గతంలో నిర్మించిన ‘సోలో, నువ్వా నేనా, రారా కృష్ణయ్య’ తరహాలో చక్కటి కుటుంబ కథా చిత్రమిది.  తండ్రీకొడుకుల అనుబంధం, బావామరదళ్ల మధ్య ప్రేమకథతో దర్శకుడు చిత్రాన్ని బాగా తీర్చిదిద్దారు’’ అన్నారు నిర్మాత.

‘‘ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఓ కుర్రాడికి అతని తండ్రితో ఎలాంటి అభిప్రాయ బేధాలొచ్చాయి? మరదలికి, అతనికి మధ్య విలన్‌లా అడ్డొచ్చింది ఎవరు? అనేది చిత్రకథ. ‘బొమ్మరిల్లు’లా క్లీన్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌’’ అన్నారు దర్శకుడు. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేశ్, తులసి, ప్రగతి, ధనరాజ్‌ నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement