
‘‘మా సంస్థ నుంచి వచ్చిన సోలో, నువ్వా నేనా, రారా.. కృష్ణయ్య’ తరహాలో చక్కని కుటుంబ కథాచిత్రమిది. సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది’’ అని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్వీకె సినిమా పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఓయ్.. నిన్నే’. వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది.
వంశీకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఇందులో హీరోది ముక్కుసూటి మనస్తత్వం. అది కొన్నిసార్లు ప్లస్, ఇంకొన్నిసార్లు మైనస్ అవుతుంటుంది. అటువంటి మనస్తత్వం వల్ల తండ్రితో ఎలాంటి అభిప్రాయభేదాలు వచ్చాయి? మరదలికి, అతనికి మధ్య ఎవరు అడ్డు వచ్చారు? అనేది చిత్రకథ. కొందరు సినీ ప్రముఖులకు సినిమాని చూపిస్తే ‘బొమ్మరిల్లు’, ‘సోలో’ సినిమాలకు మించిన విజయం సాధిస్తుందన్నారు’’ అని చెప్పారు.