అందరూ కనెక్ట్‌ అవుతారు | oye ninne movie is released tomorrow | Sakshi
Sakshi News home page

అందరూ కనెక్ట్‌ అవుతారు

Oct 5 2017 1:11 AM | Updated on Oct 5 2017 1:11 AM

oye ninne movie is released tomorrow

‘‘నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌గార్ల యాక్టింగ్‌ అంటే ఇష్టం. ముఖ్యంగా నాగార్జున మేనరిజానికి అభిమానిని నేను’’ అని నూతన హీరో భరత్‌ మార్గాని అన్నారు. సత్య చల్లకోటి దర్శకత్వంలో భరత్‌ మార్గాని, సృష్టి జంటగా వంశీకష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన సినిమా ‘ఓయ్‌.. నిన్నే’. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. భరత్‌ మాట్లాడుతూ – ‘‘వైజాగ్‌ సత్యానంద్‌ మాస్టర్‌ దగ్గర యాక్టింగ్‌ కోర్స్‌ చేశాను. కాలేజ్‌ డేస్‌లో మోడలింగ్‌ చేసేవాణ్ణి. అలా హీరోగా ఛాన్స్‌ వచ్చింది.

బిజినెస్‌ ఉండటం వల్ల నేను ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మా అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా ఇప్పుడు హీరో అయినందుకు హ్యాపీగా ఉన్నారు. ‘ఓయ్‌.. నిన్నే’ బావామరదళ్ల కథ. సినిమాలో తండ్రికీ కొడుక్కీ మధ్య అభిప్రాయభేదాలుంటాయి. కానీ తండ్రంటే గౌరవం. ఆ గౌరవం వల్ల ప్రేమను వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. బావ తన మరదలి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది తెరపైనే చూడాలి. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. అందరూ కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement