అవయవాలతో వ్యాపారం | Organs Movie Audio Launch | Sakshi
Sakshi News home page

అవయవాలతో వ్యాపారం

Aug 24 2018 12:26 AM | Updated on Aug 24 2018 12:26 AM

Organs Movie Audio Launch - Sakshi

లక్ష్మీకాంత్‌, సందీప్తి

లక్ష్మీకాంత్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఆర్గాన్స్‌’. సందీప్తి, శ్రీలక్ష్మి, ప్రసాద్‌ రెడ్డి, మోహన్‌ ఇతర పాత్రల్లో నటించారు. రవికిరణ్‌ దర్శకత్వం వహించారు. రాజ్‌ కిరణ్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత ముత్యాల రామదాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆర్గాన్స్‌’ డిఫరెంట్‌ టైటిల్‌. అవయవ దానం చేయడం అనే మంచి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా హిట్‌ అయి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఆర్గాన్స్‌’ నా మొదటి చిత్రం. మా సినిమా చూసిన వారు కంటతడి పెట్టుకుంటారు. ఇందులో అవయవదానంతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది’’ అన్నారు రవికిరణ్‌. ‘‘మనిషి జీవించడానికి అవయవాలు ఎంతో ప్రధానం. కొందరు వాటిని తమ స్వార్థానికి వ్యాపారంగా మార్చేశారు. అలాంటి వాళ్లను హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడన్నదే కథ. సెన్సార్‌ పూర్తయింది. త్వరలో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు బత్తుల లక్ష్మీనారాయణ.
∙సందీప్తి, లక్ష్మీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement