ఆయనంటే అందరికీ ఇష్టమే | Operation 2019 Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

ఆయనంటే అందరికీ ఇష్టమే

May 26 2018 2:18 AM | Updated on May 26 2018 9:00 AM

Operation 2019 Movie Trailer Launch - Sakshi

కరణం బాబ్జీ, అలివేలు, యజ్ఞా శెట్టి, వివి వినాయక్, శ్రీకాంత్‌

‘‘ఆపరేషన్‌ 2019’ ట్రైలర్‌ చాలా బాగుంది. డైరెక్టర్‌ షాట్‌ మేకింగ్‌ అద్భుతంగా ఉంది. శ్రీకాంత్‌ భయ్యా అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. నాకైతే మరీ ఇష్టం. ఆయన ఎంత మంచి నటుడో అంత మంచి మనిషి. ఎందరికో సహాయం చేశాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. శ్రీకాంత్, యజ్ఞా శెట్టి జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్‌ 2019’. ‘బి వేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. అలివేలు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కరణం బాబ్జీ మాట్లాడుతూ –‘‘సినిమా ఆడాలంటే స్టార్‌లు అవసరం లేదని  ‘మహానటి’ నిరూపించింది. ఒక సినిమా ఆడాలంటే మంచి నటీనటులు కుదరాలి.

మా సినిమాకి కుదిరారు. ఈ చిత్రంలో ముగ్గురు యంగ్‌ హీరోలున్నారు. వాళ్లెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. జూన్‌ 15లోపు సెన్సార్‌ పూర్తి చేసి,  అదే నెలలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘శ్రీకాంత్‌ కష్టమంతా ట్రైలర్‌లో చూసాం. ఈ చిత్రం యూనిట్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత అలివేలు. ‘‘మెంటల్‌ పోలీస్‌’ తర్వాత కరణం బాబ్జితో చేసిన చిత్రమిది. బాబ్జీని ప్రొడ్యూసర్స్‌ డైరెక్టర్‌ అనాలి. సినిమా బడ్జెట్‌ తగ్గించడం కోసం డైరెక్టర్‌ పడ్డ తపన మెచ్చుకోకుండా ఉండలేం. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రమిది’’అన్నారు శ్రీకాంత్‌. సీనియర్‌ నటుడు శివకృష్ణ, దీక్షాపంత్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాప్‌రాక్‌ షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement